నాకోవిషయం కావాలి
నాకోవిషయం కావాలి
నిజమై ఉండాలి
నమ్మేలా ఉండాలి
నిత్యమైనిలిచేలా ఉండాలి
నూతనంగా ఉండాలి
నచ్చేలా ఉండాలి
నలుగురూమెచ్చేలా ఉండాలి
నోర్లల్లోనానేలా ఉండాలి
చెవ్వుల్లోమారుమ్రోగేలా ఉండాలి
నిరంతరంగుర్తుండేలా ఉండాలి
రుచిగా ఉండాలి
శుచిగా ఉండాలి
పసిగా ఉండాలి
సాటిలేనిదిగా ఉండాలి
మేటియైనదిగా ఉండాలి
మదులమీటేలా ఉండాలి
ముచ్చట్లుచెప్పుకొనేలా ఉండాలి
చప్పట్లుకొట్టించేలా ఉండాలి
బొబ్బట్లువడ్డేంచేలా ఉండాలి
తేనెచుక్కలు చల్లేలాగుండాలి
తియ్యదనం ఇచ్చేలాగుండాలి
తృష్ణను తీర్చేలాగుండాలి
నిరంతరం తలచేలాగుండాలి
నరాల్లో ప్రవహించేలాగుండాలి
గుండెల్లో కొట్టుకొనేలాగుండాలి
అందంగా ఉండాలి
ఆనందమిచ్చేలా ఉండాలి
అంతరంగాల్లో వసించేలాగుండాలి
నవ్యతను చాటేలాగుండాలి
శ్రావ్యతను ఇచ్చేలాగుండాలి
రమ్యతను కూర్చేలాగుండాలి
నేను
విషయలోలుడిని
విషయాన్వేషిని
విషయవిశదీకరుడిని
విషయతపస్విని
విషయమాంత్రికుడిని
విషయప్రేమికుడిని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment