పారని కవితలు


ఎండలు

మండుతున్నాయి

గాలులు

వేడిగావీస్తున్నాయి


కవితలకు 

కరువొచ్చింది

అక్షరాలకు

మరుగొచ్చింది


రవి

నిప్పులుక్రక్కుతున్నాడు

కవి

విశ్రాంతితీసుకుంటున్నాదు


తనువులు

చెమటలుక్రక్కుతున్నాయి

ఆలొచనలు

మదులనుతట్టకున్నాయి


కాలం

సహకరించుటలేదు

కవిత్వం

జనించటంలేదు


నదులు

ఇంకిపోయాయి

నీరు

దొరకకున్నది


మబ్బులు

తేలటంలేదు

ఆకాశము

మురిపించటంలేదు


కైతలకు

లోటొచ్చింది

పుటలు

నిండకున్నవి


తొలకరికి

ఎదురుచూస్తున్నారు

కవితావిత్తనాలు

కాచుకొనియున్నాయి


సాహితీవనం

పెరగాలనికాంక్షిస్తున్నది

సరస్వతీసంతానం

సమయంకోసంవీక్షిస్తున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

 


Comments

Popular posts from this blog