పాఠకా!


కబుర్లు చెప్పనా

ఖుషీ పరచనా

కలం పట్టనా

కాగితం నింపనా


అక్షరాలు అల్లనా

పదాలు పేర్చనా

పువ్వులు విసరనా

నవ్వులు చిందనా


వెలుగులు చిమ్మనా

చీకట్లు తరుమనా

ఆటలు ఆడనా

పాటలు పాడనా


చెంతకు రానా

చేతులు కలపనా

తేనెను చల్లనా

తీపిని అందించనా


విందును ఇవ్వనా

చిందులు త్రొక్కించనా

భావాలు బయటపెట్టనా

భ్రమలు కలిగించనా


సొగసు చూపనా

మనసు తట్టనా

సూక్తులు చెప్పనా

హితాలు చేయించనా


గుండ్లపల్లి రాజేందప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog