అమ్మంటే


అమ్మంటే దేవతరా

ఆరాధించరా సేవలుచేయరా

అమ్మంటే అన్నపూర్ణరా

ఆకలితీర్చురా బాగోగులుచూచురా


అమ్మంటే లక్ష్మీదేవిరా

అడుగుపెట్టురా ఐశ్వర్యంతెచ్చురా

అమ్మంటే ఆప్యాయతరా

ప్రేమనుపంచురా పరవశపరచురా


అమ్మంటే త్యాగమూర్తిరా

అయినవారికొరకుపాటుపడరా అలసటలేకశ్రమించునరా

అమ్మంటే వెలుగురా

కాంతులుచిమ్మురా కుటుంబాన్నివృద్ధిచేయురా


అమ్మంటే అనుబంధమురా

ఏకతాటిపైనడిపించురా ఆశయాలనుసాధింపచేయురా

అమ్మంటే కుటుంబహేతువురా

గౌరవప్రతీకరా గృహానికివెన్నుపూసరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog