నాకిష్టం (గజల్-తీస్రగతి)


పూలదండ సిగదాల్చిన సుందరియే నాకిష్టం

ముసిముసిగా నవ్వుతున్న నెలతుకయే నాకిష్టం


సుగంధాలు చల్లుతున్న సొగసుగత్తె నాకందం

చిరునవ్వులు ఒలుకుతున్న సునయనయే నాకిష్టం


మల్లెపూలు కొప్పునున్న మానినంటె నాకుప్రియం

మెరుపులాగ మెరుయుచున్న కన్యకయే నాకిష్టం


గులాబీలు తురుముకున్న గుబ్బలాడి  నాభాగ్యం

గుండెలోన గుబులులేపు గుబ్బెతయే నాకిష్టం


మందారం జడనయున్న మచ్చెకంటి నానెయ్యం

తియ్యగాను పలుకుతున్న తోయలియే నాకిష్టం


చేమంతులు కురులనున్న సుభాషిణే నాకుశుభం

వలపువలను విసురుతున్న వధూటియే నాకిష్టం


సన్నజాజి పూలనల్లి సిగదోపిన ప్రసాదం

సరసంబుల సయ్యాటల సువదనయే నాకిష్టం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   



Comments

Popular posts from this blog