ప్రియుని కోరిక (గజల్ - తీస్ర గతి)


చెలితలపులు తలనుతట్ట చెంతచేర కోర్కెకలిగె

గుండెలోన గుబులుపుట్ట ఇల్లుచేర కోర్కెకలిగె


చెలిపలుకులు గుర్తుకొచ్చి తియ్యదనము రుచినిచూప

చిరునవ్వులు కనమనసయి బయలుదేర కోర్కెకలిగె


చెలిచేష్టలు మదినిముట్ట సంతసంబు సంగ్రహించ

మూటముల్లె సద్దుకోని ఊరుచేర కోర్కెకలిగె


చెలిరూపము భ్రమకొలపగ తక్షణమే చూడాలని

హృదిమురియ హుటాహుటిన సఖినిచేర కోర్కెకలిగె


చెలిసరసం  ఙ్ఞప్తికొచ్చి శీఘ్రంగా పయనమవ్వ

బండినెక్కి దూసకెళ్ళి చెలినిచేర కోర్కెకలిగె


చెలిసొగసులు గురుతురాగ ఊహలలో ఊగించగ

అనుభవించ ఆత్రుతతో సఖినిచేర కోర్కెకలిగె


చెలిమోమును తలచుకొనగ ఎగిరిపోయి వీక్షిస్తూ 

సమయాన్ని గడపాలని సకియచేర మనసుకలిగె


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog