కవనవిహారం


కవనమేఘాలు

లేస్తున్నాయి

తేలుతున్నాయి

తిరుగుతున్నాయి


కవితాజల్లులు

కురుస్తున్నాయి

తడుపుతున్నాయి

సంతసపరుస్తున్నాయి


ఆలోచనలు

ఊరుతున్నాయి

ఉరుకుతున్నాయి

ఉత్సాహపరుస్తున్నాయి


అక్షరాలు

చుట్టుకుంటున్నాయి

ముట్టుకుంటున్నాయి

పట్టుకుంటున్నాయి


పదాలు

పారుతున్నాయి

పొసగుతున్నాయి

భావాలనువ్యక్తపరుస్తున్నాయి


కలాలు

కదులుతున్నాయి

గీస్తున్నాయి

కూర్చుతున్నాయి


కాగితాలు

నల్లబడుతున్నాయి

నిండుతున్నాయి

నిక్షిప్తమవుతున్నాయి


కవితలు

కూడుతున్నాయి

కవ్విస్తున్నాయి

కుతూహలపరుస్తున్నాయి


కవనలోకం

ప్రకాశిస్తుంది

పరికించమంటుంది

పరవశపరుస్తుంది


సాహితీజగం

స్వాగతిస్తుంది

సంబరపరుస్తుంది

సన్మానిస్తుంది


పాఠకలోకం

పఠిస్తుంది

పరవశిస్తుంది

ప్రతిస్పందిస్తుంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog