పితృదేవోభవ


నాన్నకు సదాసేవలుచేస్తుంటా

కన్నఋణమును తీర్చుకుంటా

తండ్రికి పూజలుకావిస్తుంటా

దేవుడికి సమానంగాచూస్తుంటా


అయ్యకు దండాలుపెడతా

గౌరవంగా చూచుకుంటా

అబ్బకు కోరినవన్నీసమకూరుస్తా

అధికసంతసాన్ని కలిగిస్తుంటా


జనకుని కాళ్ళుకడుగుతా

తలపై నీళ్ళుచల్లుకుంటా

పితృభక్తిని చాటుకుంటా

కంటికిరెప్పలా కాచుకుంటా


నాయనకు దండనువేస్తా

కర్పూరహారతిని ఇస్తా

బాపు చెప్పినట్లువింటా

ఎదురు మాట్లాడకుంటా


బాబుసలహాలు తీసుకుంటా

హితోక్తులుగా భావిస్తుంటా

పితరునిపై మిక్కిలిశ్రద్ధచూపుతా

ఏలోటులేకుండా చూచుకుంటా


పితృదేవుని మరవకుంటా

గుండెలో దాచుకుంటా

జనదుని నిత్యంతలచుకుంటా

నామస్మరణం ప్రతిదినంచేస్తుంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  



Comments

Popular posts from this blog