నేటి నాహృదయారాటం 


అందాలున్నాయి 

ఆనందపరచటంలా 

తియ్యదనాలున్నాయి 

నోటికిచేరటంలా 


సౌరభాలున్నాయి 

నాసికనుచేరటంలా 

తేనేపదాలున్నాయి 

చెవులకందటంలా 


సమయమున్నది

విషయంతోచటంలా 

సందర్భమున్నది 

వెలువడటంలా 


ప్రేమయున్నది 

పంచుకోలేకపోతున్నా 

భ్రమయున్నది 

బయటపడలేకపోతున్నా 


ఆకాశమున్నది 

అండటంలా 

మబ్బులున్నాయి 

వర్షించటంలా 


మదియున్నది 

ముచ్చటపడటంలా 

హృదియున్నది 

పొంగిపొరలటంలా 


పువ్వులున్నాయి 

ప్రోత్సాహపరచటంలా 

వన్నెలున్నాయి 

ఆకర్షించటంలా 


ఆశలున్నాయి 

తీరటంలా 

ఆలోచనలున్నాయి 

అక్షరాలుకావటంలా 


కలమున్నది 

కదలటంలా 

కాగితమున్నది 

నిండటంలా 


వ్రాయాలనియున్నది 

రాతలుగామారటంలా 

భావాలున్నాయి 

బహిర్గతముకావటంలా 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog