ఓ రమణీమణి! (గజల్ - తీస్రగతి)
ముఖవెలుగులు ఎవరిచ్చిరి రమ్యమైన రమణీమణి
చూపునిలిపి చూచుచుంటి చిత్రమైన రమణీమణి
మేనుసోకు బాగుండెలె అబ్బురాల రమణీమణి
కనుదోయిని కట్టివేసె చిత్రమైన రమణీమణి
చిరునవ్వులు అద్భుతమే సుందరాల రమణీమణి
మనసునిండ ముట్టినవే మధురమైన రమణీమణి
నల్లగున్న కేశంబులు నచ్చాయే రమణీమణి
తెల్లకనులు పిలిచెనులే కమ్మనైన రమణీమణి
ఎరుపుఛాయ శరీరంబు అదిరెనులే రమణీమణి
ప్రేమలోన దించుచుండె దివ్యమైన రమణీమణి
బులుగుచీర కుదిరెనులే మంచిగాను రమణీమణి
చెంతచేర పిలుచుచుండె శ్రావ్యమైన రమణీమణి
తెల్లపళ్ళు చూడమంటు రమ్మనలే రమణీమణి
మెడనదండ మెరిసెనులే ముచ్చటైన రమణీమణి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment