కవితలకబుర్లు
కవితలను
వ్రాద్దామనుకుంటే
ప్రోత్సహించేవారు
కరువయ్యారు
కవితలను
చదువుదామంటే
వినేవారు
లేకున్నారు
కవితలను
ఇద్దామనుకుంటే
తీసుకునేవారు
దుర్లభమయ్యారు
కవితలను
విసురుదామంటే
పట్టుకునేవారు
రావటంలేదు
కవితలను
వడ్డిద్దామనుకుంటే
తినేవారు
చిక్కకున్నారు
కవితలను
కురిపిద్దామనుకుంటే
తడిచేవారు
ఎవరూలేరు
కవితలను
అందిద్దామనుకుంటే
దప్పికతీర్చుకోవటానికి
ఎవరూరాకున్నారు
కవితలను
పంపుదామనుకుంటే
ప్రచురించటానికి
పత్రిలవారుతయారుగాలేరు
కవితలను
ప్రచురిద్దామనుకుంటే
పుస్తకాలనుకొనటానికి
వినియోగదారులులేరు
కవితలను
బ్రతికిద్దామనుకుంటే
బాధ్యతతీసుకునేవారు
చిక్కకున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment