ఓ చెలీ! ( గజల్ తిస్ర గతి)


సప్తవర్ణ ఇంద్రధనసు ఎక్కుదమా హాయిగాను

చేయిచేయి కలుపుకోని ఆడుదమా హాయిగాను


నీలిమబ్బు తేరుపైకి ఎగప్రాకి నిలుద్దామ  

సోయగాల తేరపార చూచెదమా హాయిగాను


చందమామ చల్లదనము చల్లగాను నింగిలోన

వెన్నెలందు విహారంబు చేయుదమా హాయిగాను


కోకిలవలె  గళమునెత్తి శ్రావ్యముగా పాడుదామ 

గానంబై సంతసాల చిమ్ముదమా హాయిగాను


వాహ్యాళిని చేసెదమా మింటినందు మధురంబుగ

కులాసాగ సమయంబును గడిపెదమా హాయిగాను


జతనుకట్టి జలసాలను జోరుగాను జరుపుదామ 

సరసంబులు ఆడుకొనుచు సాగుదమా హాయిగాను


పల్లకెక్కి పోవుదమా పరవశించి గగనమందు

ఖుషీఖుషీ మాటలతో కులికెదమా హాయిగాను


ఉల్లాసము గొలుపకోరి అందముగా సిద్ధంబయి

ఆనందము అందరికీ పంచెదమా హాయిగాను


ఒకరికొకరు పుట్టితిమని భావములో మలుగుదామ

జీవితమును ఇద్దరమూ గడుపుదమా హాయిగాను 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog