పహల్గాం దాడిని తలచుకుంటే......
కోపం
కట్టలుతెంచుకుంటుంది
రోషం
మొలుచుకొనివస్తుంది
ఆయుధం
చేపట్టాలనిపిస్తుంది
దండనం
విధించాలనిపిస్తుంది
పౌరుషం
పొడుచుకొస్తుంది
ఉక్రోషం
తన్నుకొస్తుంది
ప్రతీకారం
తీర్చుకోవాలనిపిస్తుంది
అమానుషత్వం
అంతంచేయాలనిపిస్తుంది
రక్తం
ఉడుకుతుంది
దేహం
కంపిస్తుంది
ఉగ్రవాదం
అణచివేయాలనిపిస్తుంది
జాతిగౌరవం
నిలుపుకోవాలనిపిస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment