మట్టిమహత్యం


దేశమంటే

మట్టిరా

మనుజులుండే

తావురా


మట్టిపైపడితే

జననంరా

మట్టిలోకలిస్తే

మరణంరా


మట్టి

మనతల్లిరా

మట్టి

మనదేశంరా


మట్టి

మనసస్యశ్యామలంరా

మట్టి

మనపోషణద్రవ్యంరా


మట్టి

మనల్ని మోస్తుందిరా

మట్టి

మనల్ని అడుగులేయిస్తుందిరా


మట్టి

మన ఆస్తిరా

మట్టి

మన ఇల్లురా


మట్టంటే

మురికికాదురా

మట్టంటే

బురదకాదురా


మట్టి

సుజలంరా

మట్టి

సుఫలంరా


మట్టి

మొక్కలపెంచురా

మట్టి

పచ్చదనమిచ్చురా


మట్టి

ఖనిజాలగనిరా

మట్టి

రత్నాలగర్భరా


మట్టి

మన ఆరంభంరా

మట్టి

మన అంతంరా


మట్టి

భూదేవిరా

మట్టి

మహతిరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog