మానవా!
పూలబాట పట్టెదవో మానవుడా నీ ఇష్టం
ముళ్ళదారి నడిచెదవో మర్త్యుడా నీ ఇష్టం
మంచిపనులు చేసెదవో చైతన్యా నీ తలంపు
చెడుచేష్టలు సలుపెదవో మానజుడా నీ ఇష్టం
తినటానికి బ్రతికెదవో కుండీరా నీ కోర్కె
బ్రతకాలని భుజింతువో పురజనుడా నీ ఇష్టం
సౌఖ్యాలను కోరెదవో నిదద్రువా నీ అభిరుచి
కష్టాలను పడుతావో జనపదుడా నీ ఇష్టం
విజయాలను గడింతువో దేహవంత నీ ఎంపిక
ఓటములను పొందెదవో పుమాంసుడా నీ ఇష్టం
సంపాదన గడింతువో పారగతా నీ అభిమతి
బిక్షాటనకు దిగిదెవో పూరుషుడా నీ ఇష్టం
లక్ష్యాలను చేరెదవో పురవాసీ నీ సర్గము
ఆశయాలు వదిలెదవో మనుష్యుడా నీ ఇష్టం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment