ఉగ్రవాదుల ప్రోత్సాహక దేశమా!
పాము తోకతొక్కితే
బుసలు కొట్టదా
పడగ విప్పదా
కాటు వెయ్యదా!
పిల్లిని గదిలోబంధిస్తే
గాండ్రించదా
పులికాదా
పైనబడదా!
మగవాడిననివిర్రవీగితే
మీసం మెలవేస్తే
కోపంతన్నుకరాదా
కయ్యానికిదిగరా!
మెత్తగావుంటే
మెత్తుతుంటే
తిరగబడరా
తగాదాకుదిగరా!
దెబ్బతగిలితే
మౌనంగావుంటారా
కర్రపట్టరా
కసితీర్చుకోరా!
ఒకమాటంటే
ఊరుకుంటారా
నోరుతెరవరా
రెండుమాటలనరా!
నిందలేస్తే
గమ్ముగుంటారా
గొంతెత్తరా
ఘాటుగాస్పందించరా!
కయ్యానికి
కాలుదువ్వితే
పోరాటానికిదిగరా
తగినబుద్ధిచెప్పరా!
అమాయకులను సంహరిస్తే
సహిస్తారా
సంయమనంకోలుపోరా
సరైనసమాధానమివ్వరా!
ఉగ్రవాదుల ప్రోత్సాహకదేశమా
ప్రగల్భాలు వీడు
కారుకూతలు మాను
క్షమాపణలు చెప్పు మర్యాదగా లొంగిపో!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment