ఆద్యంతం రసవత్తరంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక అంతర్జాల పితృదినోత్సవం

********************************************


తేదీ 15-06-25న కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 9వ సమావేశం  అంతర్జాల పితృదినోత్సవం ఆసాంతం రసవత్తరంగా జరిగింది. ముఖ్య అతిధి, ప్రముఖ కవి, తెలంగాణా తెలుగు అకాడెమి తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ నాన్నల పాత్ర విశిష్టమైనదని, అమూల్యమైనదని పిల్లల మరియు కుటుంబ వృద్ధికి మూలకారణమని అన్నారు. అమ్మ భూమి అయితే నాన్న ఆకాశం అని, అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే, నాన్న పెంపుదలకు శిక్షణకు చిహ్నమని అన్నారు. భార్గవి,చలం,నిర్మల మొదలగు వారి సంఘటనలను, వ్రాతలను గుర్తుచేసి అందరి మన్ననలను పొందారు. సభ నంది అవార్డు గ్రహీత సినీ దర్శకుడు దీపక్ న్యాతి తొలి స్వాగత వచనాలతో ప్రారంభమయింది. సహస్ర సినీ టీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తమ అధ్యక్ష ఉపాన్యాసంలో నిర్వాహక బృందం పితృదినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించటం.  సిద్ధారెడ్డి గారి వంటి ప్రముఖ సాహితీవెత్తను అతిధిగా పిలవటం, పెక్కు ప్రముఖ కవులు పాల్గొనటం చాల సంతసించవలసిన విషయమన్నారు. గౌరవ అతిధి మరియు విశ్రాంత అటవీ శాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెడ్డి నాన్న ఔన్యాత్యాన్ని కొనియాడుతూ  సినారె పాట నాన్న నీ మనసే  వెన్న అనే పాటను గుర్తుచేశారు.


తర్వాత కవిసమ్మేళన ప్రవీణ రాధాకుసుమ కవిసమ్మేళనం నిర్వహించారు. మౌనశ్రీ మల్లిక్ కంటికి రెప్పగా మనలను కాచే దివ్యరూపం నాన్న అంటూ చక్కని గేయాన్ని వినిపించి శుభారంభం చేశారు.


పిమ్మట అయ్యల సోమయాజుల ప్రసాద్, కాదంబరి క్రిష్ణప్రసాద్, రాజ్యలక్ష్మి, బుక్కపట్నం రమాదేవి, గాదేపల్లి మల్లికార్జునుడు, కోదాటి అరుణ, గాయత్రి, చిరుమామిల్ల గాయత్రి, లలిత చండి,మంత్రిప్రగడ మార్కండేయులు, సుజాత కోకిల, ఎం వి వి ప్రసాద్, శ్రీ మధు, నారి నరేష్, డాక్టర్ దేవులపల్లి పద్మజ, ఈడిగ ముద్దా రంగప్ప, సంతోష్, పోచం లక్ష్మి నరసయ్య, శొభ దేశ్ పాండె, మిద్దె సురేష్, గుర్రం శ్రీధర్, రవీంద్రసూరి నామాల, ఆనం ఆశ్రితారెడ్డి, లెనీనా, డాక్టర్ బలిజేపల్లి నాగరత్నం, గుర్రపు మల్లేశం, కె ఎల్ కామేశ్వరరావు, సంధ్య, గోండ్ల నారాయణ, మాణిక్యలక్ష్మి, ధనమ్మారెడ్డి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ దీపక్ న్యాతి, బిటవరం శ్రీమన్నారాయణ, డాక్టర్ రాధాకుసుమ తమ అద్భుత గేయ/ పద్య/ వచనకవితలతో నాన్నను శ్లాఘిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. డాక్టర్  రాధా కుసుమ ధర్మదేవత చిత్రంలోని సినారె పాట ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అదిఎంతో మిన్న పాడి కవిసమ్మేళనానికి చక్కటి ముగింపునిచ్చారు. 


కార్యక్రమ సమన్వయకర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చక్కని ప్రసంగాలు చేసిన నందిని సిద్ధారెడ్డి, లింగ క్రిష్ణారెడ్డి, మౌనశ్రీ మల్లిక్ గార్లకు,సాంకేతిక సహకారం అందించిన బీటవరం శ్రీమన్నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ   కార్యక్రమం బాగా జరిగిందని పాల్గొన్న వారందరూ సంతోషం వ్యక్తపరిచారు. శ్రీమతి పొన్నాల ధనమ్మ వందన సమర్పణతో మూడు గంటల కార్యక్రమం ముగిసింది.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,సమన్వయకర్త, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక





Comments

Popular posts from this blog