ప్రకృతిసోయగాలు పడతిపొంకాలు 


ప్రకృతి పులకించి

తనలోని అందాన్నంతా

నీ వంటికిస్తే

అవలోకించనా ఆస్వాదించనా!


గాలి గట్టిగావీచి

సుగంధాన్ని వెదజల్లుతూ

నీ కొంగునురెపరెపలాడిస్తే

ముచ్చటపడనా మురిసిపోనా!


కొంటిగా చూస్తూ

కాంతులు చల్లుతూ

నీ కంటిచూపులుతాకితే

పరవశించనా పొంగిపోనా!


సెలయేరు పారుతూ

చోద్యాలు చూపుతంటే

నిను గుర్తుకుతెచ్చుకోనా

ఆదమరచి చూడనా!


రంగురంగుల పూలు

రమణీయతలు చూపుతుంటే

నీ సోయగాలుపోల్చుకోనా

ఆనందంలో చిందులుత్రొక్కనా!


ఆకాశం అకస్మాత్తుగా

అమృతజల్లులు చల్లుతుంటే

నీ అనురాగసుధలను

తనివితీరా క్రోలనా!


ఉరుములు దడిపిస్తుంటే

మెరుపులు భయపెడుతుంటే

నీ చెంతకుచేరనా

చేతులలోకి తీసుకోనా!


ఆలోచనలు తడుతుంటే

అంతరంగం ఉప్పొంగుతుంటే

నిన్ను తలచుకోనా

ఆనందసాగరంలో మునగనా!


వెండి జాబిలి

వెన్నెల కురిపిస్తుంటే

నీ తోడునుకోరనా

హాయిగా విహరించనా!


నీలాకాశం కమ్ముకుంటే

హృదిని దోస్తే

నీకోసం వెదకనా

దగ్గరకుతీసుకోనా సంతసించిపోనా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం  



Comments

Popular posts from this blog