ఆశలజోరు

  

మబ్బులు లేస్తే

వానపడుతందనే ఆశ


ఉద్యోగం దొరికితే

కడుపునింపుకోవచ్చనే ఆశ


తోడుదొరికితే

కష్టసుఖాలుపంచుకోవచ్చనే ఆశ


మంచికలవస్తే

నిజంచేసుకుందామనే ఆశ


విజయందక్కితే

గుర్తింపువస్తుందనే ఆశ


అండనిచ్చేవారుంటే

అడుగులుముందుకెయ్యాలనే ఆశ


అందాలుకనబడితే

ఆనందంపొందవచ్చనే ఆశ


ఆలోచనతడితే

అమలుపరుద్దామనే ఆశ


అందలమెక్కితే

అన్నీసాధించవచ్చనే ఆశ


లక్ష్యాన్నిచేరితే

జీవితాన్నిగెలిచామనే ఆశ


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog