ఓ ప్రేమికుడితంటాలు 


ఓ పోకిరీ!

తలతిప్పకుండా

ఎందుకలా చుస్తున్నావు

కొరుక్కుతింటావా


ఓ అల్లరోడా!

విడవకుండా

ఎందుకు వెంటబడుతున్నావు

బుట్టలోవేసుకుంటావా


ఓ చిలిపోడా!

అదేపనిగా

ఎందుకుపిలుస్తున్నావు

కబుర్లతో కాలక్షేపంచేయాలనా


ఓ చిన్నోడా!

చేతినిండా

పూలెందుకుపట్టుకోనియున్నావు

అందించి ప్రేమనుతెలపాలనా


ఓ కుర్రోడా!

ఆపకుండా

ఎందుకలా నవ్వుతున్నావు

అందాన్ని ఆస్వాదిస్తున్నావా


ఓ పోరిగా!

చేతిలోనిది ఉత్తరమా

ఎందుకు చూపిస్తున్నావు

ప్రేమలేఖ అందించాలనా


ఓ కిలాడీ!

తలగీక్కుంటున్నావా

ఏమిటి ఆలోచిస్తున్నావు

చిన్నదాన్ని ఎలావశపరచుకోవాలనా


ఓ బుల్లోడా!

కాచుకొనియున్నావా

వలపువలను విసిరి

చెలిని చేపలాబంధించాలనా


ఓ పిల్లోడా!

ఎదురుచూస్తున్నావా

మన్మధబాణం విసిరి

కామాంధురాలుని చేయాలనుకుంటున్నావా


ఓ పిరికోడా!

వణికిపోతున్నావా

కథ అడ్డంతిరిగితే

చెంప చెళ్ళుమంటుందనా


ధైర్యం

చెయ్యరాడింబకా

ఆశయం

నెరవేర్చుకోరా


విజయం

పొందరాపిచ్చోడా

జీవితం

సుఖమయంచేసుకోరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog