పక్షులు ప్రవృత్తులు
అక్కుపక్షి
అలమటిస్తుంది
దిమ్మతిరిగి
దిక్కుతోచకా
గాలిపక్షి
అరుస్తుంది
అర్ధంపర్ధంలేకుండా
ఆడుతూపాడుతూ
తల్లిపక్షి
తంటాలుపడుతుంది
తృప్తికరమైనభోజనం
తనపిల్లలకందించాలనీ
పిల్లపక్షి
ఎదురుచూస్తుంది
అండాదండకు
ఆలనాపాలనకూ
గర్భిణీపక్షి
కలలుకంటుంది
బిడ్డలనుకనాలని
పెద్దవారినిచేయాలనీ
స్వేచ్ఛాపక్షి
ఆడుతుంది పాడుతుంది
తేనెచుక్కలు చిందుతూ
గాంధర్వగానం వినిపిస్తూ
నోటిపక్షి
గోలచేస్తుంది
కర్ణకఠోరంగా
కావుకావుమంటూ
సంగీతపక్షి
గొంతెత్తిపాడుతుంది
వీనులకింపుగా
కుహూకుహూమంటూ
పిచ్చిపక్షి
ప్రేలాపనలుచేస్తుంది
మనసులను
కకలావికలంచేయాలనీ
ఒంటరిపక్షి
ఉబలాటపడుతుంది
ఏకాంతంవీడాలని
గుంపులోచేరాలనీ
ప్రేమపక్షి
పరితపిస్తుంది
సాహచర్యానికి
సంతోషానికీ
కవిపక్షి
కవితలుకూరుస్తుంది
కమ్మనిరాగాలతో
కుతూహలపరచాలనీ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment