కలలకెరటాలు కవితలతరంగాలు
(కలల అలలు)
నీవు నిత్యంవస్తున్నావు
ఆలోచనలు లేపుతున్నావు
భావాలు పుట్టిస్తున్నావు
అక్షరజల్లులు కురిపిస్తున్నావు
కవితలవరద పారిస్తున్నావు
నీవు వెన్నుతడుతున్నావు
కలం పట్టిస్తున్నావు
కాగితాలు నింపిస్తున్నావు
కుషీ పరుస్తున్నావు
కైతలు కూర్పిస్తున్నావు
నీవు కవ్విస్తున్నావు
విషయలు ఇస్తున్నావు
పదాలు పేర్పించుతున్నావు
పరవశం కలిగిస్తున్నావు
కయితలు రాయిస్తున్నావు
నీవు అందాలుచూపుతున్నావు
ఆనందం అందిస్తున్నావు
ఆకాశానికి తీసుకెళ్తున్నావు
హరివిల్లును ఎక్కిస్తున్నావు
కవనాలు అల్లిసున్నావు
నీవు పూలనిస్తున్నావు
పరిమళాలు చల్లుతున్నావు
మెడకు దండనేస్తున్నావు
మత్తులోకి దించుతున్నావు
సాహిత్యాన్ని సుసంపన్నంచేయిస్తున్నావు
నీవు మేలుకొలుపుతున్నావు
మాయమవుతున్నావు
మదిని ముట్టుతున్నావు
హృదిని ఆక్రమించుకుంటున్నావు
కవిత్వంలో కాలక్షేపంచేయిస్తున్నావు
స్వప్నం చైతన్యపరుస్తుంది
ఆశలను లేపుతుంది
జాబిలిపైకి తీసుకెళ్తుంది
వెన్నెలలో విహరింపజేస్తున్నది
వాక్యాలను రసాత్మకంచేస్తుంది
కలలు నిజము
కైతలకు ప్రేరణము
కల్లలు కానేకావు
కవులు మహనీయులు
కూర్పులు అద్భుతాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment