కవిగారి తపనలు


మొదలు

దొరకటంలా

ప్రారంభించటానికి


దారి

కనబడటంలా

గమ్యంచేరటానికి


తోడు

దొరకటంలా

కాలక్షేపంచేయటానికి


ప్రోత్సాహం

లభించటంలా

ప్రతిభనుబయటపెట్టటానికి


అక్షరాలు

అందటంలా

అందంగా అమర్చటానికి


పదాలు

పొసగటంలా

కమ్మగా కూర్చటానికి


సమయం

చిక్కటంలా

కలంపట్టటానికి


ఆలోచనలు

ఊరటంలా

భావాన్నివెలిబుచ్చటానికి


విషయం

తట్టటంలా

ముందుకుసాగటానికి


ముగింపు

కనబడటంలా

పూర్తిచేయటానికి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog