ప్రాసలరాయుని ప్రబోధాలు


పేరున్నదని

ఊరున్నదని

కారున్నదని

నోరుపారేసుకోకోయ్


అందమున్నదని

ఆనందమున్నదని

అందలమున్నదని

అరవిందముననుకోకోయ్


పూవులాంటివాడినని

పొంకమున్నవాడినని

పరిమళముచల్లువాడినని

పెట్రేగిప్రవర్తించకోయ్


జాబిలియున్నాడని

వెన్నెలచల్లుతున్నాడని

హాయిగొలుపుతున్నాడని

విరహంలోపడదోయకోయ్


ఆజ్యమున్నది

అంగారకమున్నదని

అవకాశమొచ్చిందని

అగ్గినిరేపకోయ్


రంగులున్నాయని

హంగులున్నాయని

పొంగులున్నాయని

కంగుకంగుమనకోయ్


మనసున్నదని

బుద్ధియున్నదని

ఙ్ఞానమున్నదని

అతితెలివిచాటుకోకోయ్


శైలియున్నదని

శిల్పమున్నదని

సాహితీద్రష్టనని

చంకలెగరేసుకోకోయ్


అక్షరాలున్నాయని

పదాలున్నాయని

ఆలోచనలున్నాయని

చెత్తకైతలల్లకోయ్


పత్రికలున్నాయని

ప్రచురిస్తాయని

పాఠకులున్నారని

పేలవకవితలుపంపకోయ్


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog