అమ్మా సరస్వతీ!


నా మనమున

గొప్ప ఆలోచనలు పారించు

నా పెదాల 

అక్షరామృతం కురిపించు


నా మోమున

వెలుగులు ప్రసరించు

నా గళమున

గాంధర్వగానము వినిపించు


నా నోటన 

తేనెపలుకులు చిందించు 

నా వాక్కుల

సుశబ్దములు శోభిల్లించు


నా కళ్ళకు

అందాలదృశ్యాలు చూపించు

నా ఎదన 

ఆనందము కాపురముంచు


నా కలమున

పదాలజల్లులు ప్రవహించు

నా చేతన

అద్భుతకవితలు వ్రాయించు


నా ఉల్లాన

కలకాలము నిలువు

నా రాతలకు

మెరుగులు దిద్దు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం   



Comments

Popular posts from this blog