పిల్లలం పిడుగులం మనం 


బడులకు వేళ్దాం మనం

పాఠాలు చదువుదాం మనం

అ ఆలు దిద్ద్దుదాం మనం

అమ్మ ఆవులు పలుకుదాం మనం    ||బడులకు||


ఆటలు ఆడుదాం మనం

పాటలు పాడుదాం మనం

పరుగులు తీద్దాం మనం

పందెములు కాద్దాం మనం        ||బడులకు||


తల్లిని కొలుద్దాం మనం

తండ్రిని పూజిద్దాం మనం

గురువును ఆరాధిద్ద్దాం మనం

పెద్దలను గౌరవిద్దాం మనం        ||బడులకు||

 

అక్కలతో తిరుగుదాం మనం

అన్నలతో మాట్లాడుదాం మనం

చెల్లెళ్ళతో చిందులేద్దాం మనం

తమ్ముళ్ళతో కబుర్లాడుదాం మనం   ||బడులకు||

 

కోకిలలా పాడుదాం మనం

చిలకలా పలుకుదాం మనం

నెమలిలా నాట్యమాడుదాం మనం        

హంసలా నడుద్దాం మనం        ||బడులకు||   


ఊరుపేరు నిలుపుదాం మనం

వంశఖ్యాతి నిలబెడదాం మనం

రాష్ట్రకీర్తిని పెంచుదాం మనం

జాతిగౌరవం  చాటుదాం మనం    ||బడులకు||

 

తల్లిభాషను వ్యాపిద్దాం మనం

తేటమాటలు వాడుదాం మనం

తేనెపలుకులు చిందుదాం  మనం

తెలుగుగొప్పలు చెప్పుదాం మనం   ||బడులకు||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog