ఓ కొంటెదానా! ( గజల్ తీస్ర గతి)
ఎదురుగుండ నిలచియున్న ఎర్రదాన ఇటుచూడవె
మనసునిండ ఆశలున్న బుల్లిదాన ఇటుచూడవె
అందమైన చూపులున్న చిన్నదాన తలతిప్పకె
బుంగమూతి పెట్టకుండ బుజ్జిదాన ఇటుచూడవె
చిరునవ్వులు చిందుతున్న చిట్టిదాన విసుగుకోకె
బుంగమూతి పెట్టకుండ పిల్లదాన ఇటుచూడవె
కొప్పులోన మల్లెలున్న కొంటెదాన కోపపడకె
మత్తులోన తోయకుండ కుర్రదాన ఇటుచూడవె
వేగలేక వేచియున్న చిలిపిదాన తొందరేలె
వయ్యారము ఒలకబోస్తు వెర్రిదాన ఇటుచూడవె
పొగరుయున్న పరువమున్న చిట్టిదాన కసరబోకె
పొంగులున్న ప్రతిభయున్న పసిడిదాన ఇటుచూడవె
హంగులున్న హాయికొలిపె పోరదాన మంకువలదె
పదేపదే అలగకకుండ పిచ్చిదాన ఇటుచూడవె
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment