కవిత్వం
కవిత్వం ఊహలరూపం మాటలమార్గం
కవిత్వం భావాలబహిర్గతం సందేశాలసమాహారం
కవిత్వం వైయక్తికం విశిష్టశిల్పం
కవిత్వం ప్రగతిపధం ప్రయోజనకరం
కవిత్వం అక్షరసేద్యం పంటలపెంపకం
కవిత్వం పదాలప్రయోగం ప్రాసలబద్ధం
కవిత్వం వాక్యనిర్మాణం వ్యాకరణబద్ధం
కవిత్వం ఆస్వాదనీయం ఆనందదాయకం
కవిత్వం మధురం సౌరభం
కవిత్వం ప్రబోధం పాఠం
కవిత్వం నూతనోత్సాహం అసిధారావ్రతం
కవిత్వం ఆయుధం సాధనీయం
కవిత్వం ఆలోచనలప్రతిఫలం భావాలవ్యక్తీకరణం
కవిత్వం ఒకవ్యాపకం మనోవికారం
కవిత్వం అందాలదృశ్యం ఆనందకారకం
కవిత్వం ఒకవర్షం ఒకప్రవాహం
కవిత్వం కళ్ళకుప్రకాశం మోములకుచిరుహాసం
కవిత్వం కలాలఫలం కలలస్పందనం
కవిత్వం గీతలకాగితం కల్పనలకూర్చటం
కవిత్వం కావ్యాలంకారం ఓసాహిత్యవిభాగం
కవిత్వం ఉబికినహృదయం పొంగినపరవశం
కవిత్వం అత్యంతశక్తివంతం అభినందనీయం
కవిత్వం ఎప్పటికీసశేషం నిత్యచైతన్యం
కవిత్వం అమృతం అజరామరం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment