మంచిమాటలు
(పంచపద్యాలు)
పచ్చదనము తగ్గె వెచ్చదనము హెచ్చె
ఋతువులగమనమున గతులుమారె
కలుషితంబునయ్యె గాలి జలము భూమి
జనులు బ్రతుకుటెట్లు జగమునందు
మంచిమాట చెప్ప మదినందు తలపోయ
మారి మొదట నీవు మార్చుపరుల
మార్గదర్శకుడిగ మనుగవలయునన్న
సర్వహితుడుగాను సాగుమెపుడు
నీతివంతుదుగను నిత్యము మెలుగుము
ఆదరించు పరుల సాదరముగ
చక్కనైనబాట నిక్కముగానెంచి
వెడలుమయ్య నీవు వెరవకుండ
పరుగుతీయువాని పడవేయవలదయ్య
గెంట చూడకయ్య గుంటతీసి
సహకరించవయ్య సజ్జనులకెపుడు
సర్వవేళలందు శ్రమనుపెట్టి
పగనుబట్టినట్టి పామువలె తలచి
దుర్మతులకు నీవు దూరజరుగు
మంచిచేయునట్టి మనుజుల గుర్తించి
తోడుగనిలుచొనుము తొణకకుండ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.భాగ్యనగరం
Comments
Post a Comment