నా అంతరంగ ఆలోచనలు

(అఆల ఆంధ్రవైభవము)


అక్షరాలు

అల్లాలని ఉన్నది

అద్భుతకవితలు

అందించాలని ఉన్నది


అడుగులు

ఆపకూడదని ఉన్నది

అంతిమలక్ష్యము

అందుకోవాలని ఉన్నది


అందాలు

ఆస్వాదించాలని ఉన్నది

ఆనందాలు

అందరికీపంచాలని ఉన్నది


అంతరంగాలు

అంటుకోవాలని ఉన్నది

ఆలోచనలు

ఆవిర్భవింపచేయాలని ఉన్నది


అవకాశాలు

అందిపుచ్చుకోవాలని ఉన్నది

అపజయాలు

అరికట్టాలని ఉన్నది


ఆపదలు

అధికమించాలని ఉన్నది

అందలము

అధిరోహించాలని ఉన్నది


అపనిందలు

అడ్డుకోవాలని ఉన్నది

అబద్ధాలు

ఆపించాలని ఉన్నది


అగచాట్లు

అరికట్టాలని ఉన్నది

ఆరాటాలు

అనర్ధకమనిచెప్పాలని ఉన్నది


ఆత్మాభిమానము

ఆజన్మాంతంనిలుపుకోవాలని ఉన్నది

అందరిమన్ననలు

అందుకోవాలని ఉన్నది


ఆశిస్సులు

అందించాలని ఉన్నది

అన్నిశుభాలు

ఆపాదించాలని ఉన్నది


అక్షరసేద్యము

అనునిత్యంచేయాలని ఉన్నది

అత్యున్నతకైతలు

అప్రతిహతంగాసాగించాలని ఉన్నది


అసమాన్యప్రతిభను

అవలోకింపజేయాలని ఉన్నది

అల్పకాలమందు

అలరారాలని ఉన్నది



గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog