ఆనందమానందమాయనే


పకపకా నవ్వుతున్నానంటే 

పరమానందాన్ని

పక్కాగాపొందినట్లే


మోమున వెలుగులుచిమ్ముతున్నానంటే

మహదానందాన్ని

చిక్కించుకున్నట్లే


ఎగిరి గంతులేస్తున్నానంటే

ఎంతోసంతోషాన్ని

ఎదననింపుకున్నట్లే


కళ్ళు కాంతులుచిమ్ముతున్నాయంటే

ఆహ్లాదాన్ని

దోరబుచ్చుకున్నట్లే


మిఠాయీలు పంచుతున్నానంటే

మదికిమురిపాన్ని

ముట్టజెప్పినట్లే


చప్పట్లు కొడుతున్నానంటే

ఉత్సాహం ఉల్లాన్ని 

తట్టినట్లే


వెన్నెలలో విహరిస్తున్నానంటే

మానసికానందాన్ని

హృదయానికప్పజెప్పినట్లే


ఆనందభాష్పాలు కారుస్తున్నానంటే

సంతసంతో అంతరంగాన్న్ని 

నింపుకున్నట్లే


అదృష్టం వరించిందంటే

అమితానందాన్ని

అందుకున్నట్లే


విజయం దక్కిందంటే

నూతనోత్సాహాన్ని

దక్కించుకున్నట్లే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog