కవితామాధుర్యాలు
తీపిపదార్ధాలు
తింటుంటా
తియ్యనిపలుకులు
తొనకుతుంటా
కమ్మనికవితలు
కూరుస్తుంటా
కవనప్రేమికులను
కుతూహలపరుస్తుంటా
బెల్లపుముక్కలు
చప్పరిస్తుంటా
ఆనందమును
చేకూర్చుతుంటా
చక్కెరరసము
త్రాగుతుంటా
సంతసము
కలిగిస్తుంటా
రసగుల్లాలు
లాగేస్తుంటా
నవరసాలు
చిందిస్తుంటా
మిఠాయీలు
మెక్కుతుంటా
మధురానుభూతులు
క్రక్కుతుంటా
జిలేబీలు
ఆరగిస్తుంటా
తనువులు
తృప్తిపరస్తుంటా
లడ్డులు
కొరక్కుతింటుంటా
కాయాలను
కుషీపరస్తుంటా
పూతరేకులు
భక్షిస్తుంటా
మదులను
ముచ్చటపరస్తుంటా
పాయసము
పుచ్చుకుంటుంటా
పారవశ్యము
పంచిపెడుతుంటా
కవితామాధుర్యాలు
అందిస్తుంటా
సాహితీప్రియులను
సంబరపరస్తుంటా
తియ్యనికవితలు
సృష్టిస్తుంటా
పాఠకులహృదులు
పులకరిస్తుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment