యుద్ధం వద్దురా!


యుద్ధం

వద్దురా

నాశనం

వలదురా


సమరం

చాలించరా

శాంతిని

ప్రేమించరా


పోరాటం

చేయొద్దురా

వినాశనం

కోరొద్దురా


కయ్యం 

మానురా

వియ్యం

సలపరా


ద్వేషం

పెంచుకోకురా

విధ్వంసం

తెచ్చుకోకురా


పోరు

పనికిరాదురా

ప్రగతిమార్గము

పట్టరా


ఆలము

అనవసరమురా

అభివృద్ధికి

ఆటంకమురా


కోట్లాటకు

దిగవద్దురా

దెబ్బలు

తినవద్దురా


రణము

మరణాలకుహేతువురా

ప్రాణాలకు

హానికరమురా


జగడము

ప్రమాదమురా

తకరారులు

కలిగించురా


తగవులు

రుద్దితే

తగినశాస్తి

చెయ్యరా


కలహం

కోరితే

పీచమణచరా

బుద్ధిచెప్పురా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog