ఓ వెన్నెలా!
వెన్నెల వెన్నెల వెన్నెలా
పున్నమి రాతిరి వెన్నెలా
చక్కని చల్లని వెన్నెలా
తెల్లని జాబిలి వెన్నెలా ||వెన్నెల||
ఏ భామ వన్నెవే వెన్నెలా
మదిని తడుతున్నావే వెన్నెలా
ఏ లేమ నవ్వువే వెన్నెలా
రమ్మని పిలుస్తున్నావే వెన్నెలా ||వెన్నెల||
ఏ వనిత సిగమల్లెవే వెన్నెలా
తెల్లగా కనిపిస్తున్నావే వెన్నెలా
ఏ ముదిత మోమువే వెన్నెలా
మెరుపులా మెరుస్తున్నావే వెన్నెలా ||వెన్నెల||
ఏ పడతి పులకరింతవే వెన్నెలా
ఇంపుసొంపులు ఒలుకుతున్నావే వెన్నెలా
ఏ సుదతి ఎదమంటవే వెన్నెలా
నిప్పును ఆర్పమంటున్నావే వెన్నెలా ||వెన్నెల||
ఏ మెలత మురిపానివే వెన్నెలా
పకపకలాడుతున్నావే వెన్నెలా
ఏ నెలత పైపూతవే వెన్నెలా
ధగధగలాడుతున్నవే వెన్నెలా ||వెన్నెల||
ఏ అంగన చూపువే వెన్నెలా
వయ్యారాలతో వెలుగుతున్నావే వెన్నెలా
ఏ అతివ ప్రతీకవే వెన్నెలా
కళ్ళనుకట్టేస్తున్నావే వెన్నెలా ||వెన్నెల||
చేతులు చాస్తున్నావే వెన్నెలా
బయటకు రమ్మంటున్నావే వెన్నెలా
విహారంచేద్దామంటున్నావే చిరునవ్వులతో వెన్నెలా
ముచ్చట్లుచెప్పుకుందామంటున్నావే మెల్లగా వెన్నెలా ||వెన్నెల||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment