తెలుగు తడాక
నోటిలో
నానుతుంటుంది
నాలుకపై
నృత్యంచేస్తుంటుంది
కళ్ళల్లో
కూర్చుంటుంది
కాంతులు
కురిపిస్తుంటుంది
కడుపునుంచి
బయటకొస్తుంది
కమ్మనివిషయాలు
క్రక్కిస్తుంది
తీయదనం
తినిపిస్తుంది
కమ్మదనం
కలిగిస్తుంది
పువ్వులు
విసిరిస్తుంది
పరిమళాలు
వెదజల్లిస్తుంది
నవ్వులు
చిందిస్తుంది
మోములు
వెలిగిస్తుంది
పెదవులు
తెరిపిస్తుంది
తేనియలు
చిందిస్తుంది
గళము
విప్పిస్తుంది
గేయము
పాడిస్తుంది
కలము
పట్టిస్తుంది
కవితలు
రాయిస్తుంది
మదులు
మురిపిస్తుంది
ఉల్లాలు
ఉరికిస్తుంది
అక్షరాలు
చల్లిస్తుంది
పదాలు
పారిస్తుంది
పద్యాలు
కూర్పిస్తుంది
పాటలు
వినిపిస్తుంది
త్రిలింగాలు
స్ఫురింపజేస్తుంది
జెంటూశబ్దము
స్మరింపజేస్తుంది
ఇటలీభాషను
గుర్తుకుతెస్తుంది
బ్రౌనుదొరను
తలపిస్తుంది
నన్నయను
స్మరించమంటుంది
రాయలను
శ్లాఘించమంటుంది
నవరసాలు
చిందిస్తుంది
నవనాడులు
కదిలిస్తుంది
పంక్తులు
పేర్పిస్తుంది
కవితలు
సృష్టిస్తుంది
కలము
పట్టిస్తుంది
కవితలు
రాయిస్తుంది
కవనాలు
చదివిస్తుంది
పాఠకులను
ప్రోత్సహిస్తుంది
కవనాలు
చదివిస్తుంది
పాఠకులను
ప్రోత్సహిస్తుంది
అకారంతం
అత్యంతమధురం
ఆలకించటం
అంతర్యామివరం
అమృతం
నిత్యముకురిపించుదాం
ఆనందం
అనుదినమందించుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment