ఉత్సాహభరితంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 9వ అంతర్జాల సమావేశం
నిన్న 29-07-25 వ తేదీ మంగళవారం సి. నారాయణరెడ్డి జయంతి సందర్భ సమావేశం ఆద్యంతం అంతర్జాలంలో ఉత్సాహభరితంగా జరిగింది. సమావేశానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన తెలంగాణా స్పెషల్ డిప్యూటి కలక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు సినారె గారి సాహిత్య సేవను, భాషా పటిమను, విషిష్టతలను సోదాహరణంగా పేర్కొన్నారు. సినారె గారి గేయ కావ్యాలు విశ్వనాధనాయుడు, నాగార్జునసాగరం మరియు కర్పూర వీర వసంతరాయలు చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. విశిష్ట అతిధి ప్రఖ్యాత కవి, ఉపాధ్యాయుడు శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు సినారె గారికి ఙ్ఞానపీఠ అవార్డు మరియు పేరు ప్రఖ్యాతిని తెచ్చిన విశ్వంభర కావ్యాన్ని అద్భుతంగా విశ్లేషించి అందరి మన్ననలను పొందరు.ప్రత్యేక అతిధి విశ్రాంత అటవీశాఖ అధికారి, సాహిత్యప్రియుడు శ్రీ అంబటి లింగ క్రిష్ణారెద్ది గారు సినారె పాటలను వినిపించి శ్రోతలను సంతసపరిచారు. సభాధ్యక్షులు సినీ టీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు సినారె గారి గజల్లను, పాటలను పాడి వినిపించి ఆహ్వానితులు అందరిని ఆహ్ల్లాద పరిచారు. తొలుత నంది అవార్డు గ్రహీత సినీ దర్శకుడు శ్రీ దీపక్ న్యాతి అతిధులకు కవులకు తోటి నిర్వాహకులకు స్వాగతం పలికారు. సమన్వయకర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వేదిక ఉద్దేశ్యాలను తెలియజేసారు.
పిమ్మట కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధాకుసుమ గారు కవిసమ్మేళనం నిర్వహించారు. కవులు/కవయిత్రులు సినారె గారి పై కవితలను, పద్యాలను, పాటలను పాడి సినారె గారికి చక్కని అక్షర నివాళులు అర్పించారు. కవిసమ్మేళనంలో కవులు అవధానం అమృతవల్లి, మంత్రిప్రగడ మార్కండేయులు, శ్రీనివాస్ ఎ, రామాయణం ప్రసాదరావు, కాదంబరి క్రిష్ణప్రసాద్, కె.ఎల్.కామేశ్వరరావు, లలితా చండి, కోకిల సుజాత, ఆకుల సుష్మ, శోభ దేశ్ పాండె, అయ్యల సోమయాజుల ప్రసాద్, బలుసాని వనజ, రాజ్యలక్ష్మి శశిధర్, గూండ్ల నారాయణ, కట్టా శ్యామలాదేవి, బుక్కపట్నం రమాదేవి, కొత్త ప్రియాంక, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, మోటూరి నారాయణరావు, కోదాటి అరుణ, మేడిసెట్టి యోగేశ్వరరావు, ఓగిరాల గాయత్రి, కొలచన శ్రీసుధ, చిరుమామిళ్ళ గాయత్రి, బూర దేవానందం, చిట్టాబత్తిన వీరరాఘవులు, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, బిటవరం శ్రీమన్నారాయణ, ధనమ్మ, దీపక్ న్యాతి, రాధాకుసుమ గార్లు పాల్గొని ఆహుతులను అలరించారు.
ధనమ్మ గారి అద్భుత కవితారూప వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. బిటవరం శ్రీమన్నారాయణ ఇబ్బందులు లేకుండా చక్కగా సాంకేతికి సహకారం అందించారు. సభను అద్భుతంగా నిర్వహించినందుకు అందరూ వేదికకు అభినందనలు తెలియజేశారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, సమన్వయకర్త, కాప్రా మల్కాజగిరి సాహిత్య వేదిక
Comments
Post a Comment