నిండు చందమామా!
పున్నమీ చందమా
చక్కనీ బింబమా
ఆకాశ దీపమా
మనుజుల మురిపెమా ||అందమా||
పుడమికి వెలుగువా
మోములా జిలుగువా
చల్లనీ వెన్నెలవా
తెల్లనీ వన్నియవా
మనసులా దోస్తావా
మోదమూ ఇస్తావా
హృదినీ తడతావా
హాయినీ కొలిపెదవా ||అందమా||
ప్రేమను రేపుతావా
చెలియను చేరుస్తావా
సరదా చేయిస్తావా
సరసం ఆడిస్తావా
కబుర్లు చెప్పిస్తావా
కాలము గడిపిస్తావా
కులుకులు చేరుస్తావా
తళుకులు చిమ్మిస్తావా ||అందమా||
కోర్కెలు తీరుస్తావా
బ్రతుకును పండిస్తావా
పువ్వులు పూయిస్తావా
నవ్వులు కురిపిస్తావా
మాటలు కలుపుతావా
బాటలు చూపుతావా
ఆటలు ఆడిస్తావా
పాటలు పాడిస్తావా ||అందమా||
వెలుగులు చిమ్ముతావా
తాపాలు తీరుస్తావా
కోపాలు తగ్గిస్తావా
మోములు మెరిపిస్తావా
అమృతము అందిస్తావా
తేనియలు చిందిస్తావా
ముద్దులూ గుప్పిస్తావా
ముచ్చటా పరుస్తావా ||అందమా||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment