చెట్లపాఠాలు
చెట్టును చూడు
మౌనంగా ఎదుగు
తీగలను కను
మనసులకు అల్లు
పువ్వులను కాంచు
పరవశము పొందు
పండ్లను ఆరగించు
కడుపు ఆకలితీర్చు
ఆకులను పరికించు
పచ్చదనంతో పరిఢవిల్లు
కొమ్మలను పట్టు
ఉయ్యాలలా ఊగు
నీడలో నిలువు
స్వేద తీరు
గొడుగులా భావించు
ఎండలో తిరుగకు
రాళ్ళను వేయవద్దు
కర్రలు విసరవద్దు
కత్తులను పట్టవద్దు
గొడ్డళ్ళను వాడవద్దు
పక్షుల్లాగా వ్రాలు
కోతుల్లాగా చిటారుకొమ్మలచేరు
మానుల్లాగా పెరుగు
కుర్చీల్లాగా తయారగు
మబ్బులను ఆకర్షించు
చినుకులు చిటపటాకురిపించు
బిందువై ముత్యములామెరువు
టపటపమంటూ సంగీతంవినిపించు
అందాలు చూపించు
ఆనందము కలిగించు
చిరకాలము జీవించు
కొట్టేసినా చిగురించు
ఎండలకు వెరవకు
వానలకు బెదరకు
పెనుగాలులకు భీతిచెందకు
వరదవృద్ధితికి కొట్టుకపోకు
వృక్షాలకు వందనాలు
ప్రకృతికి ప్రణామాలు
భూమాతకు నమస్కారాలు
భగవంతునికి ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment