మావారు
మావారు మంచోరు
నామాట వింటారు
చెప్పింది చేస్తారు
అడిగింది ఇస్తారు ||మావారు||
ప్రేమగా చూస్తారు
తోడుగా ఉంటారు
అండగా నిలుస్తారు
రక్షణా కలిపిస్తారు
చీరెలూ కొంటారు
నగలూ చేయిస్తారు
అప్సరసవు అంటారు
పొగడ్తలు గుప్పిస్తారు ||మావారు||
పువ్వులూ పట్టుకొస్తారు
కొప్పులో తురుముతారు
అత్తరూ తెస్తారు
వంటిపై చల్లుతారు
నవ్వుల్లో ముంచుతారు
మోమునూ వెలిగిస్తారు
సరసాలు ఆడుతారు
సరదాలు చేస్తారు ||మావారు||
సినిమాలు చూపుతారు
కారుల్లో తిప్పుతారు
మిఠాయీలు కుక్కుతారు
ఐసుక్రీములు తినిపిస్తారు
పార్కుకూ తీసుకెళ్తారు
పరవశా పరుస్తారు
మనసునూ దోస్తారు
హృదినీ తాకుతారు ||మావారు||
అందగత్తెనని పిలుస్తారు
ఆకాశనికి ఎత్తుతారు
మాటకారినినని పొగుడుతారు
తేనెచుక్కలని చల్లమంటారు
చేతులూ కలుపుతారు
చప్పట్లు కొట్టిస్తారు
వదిలేది లేదంటారు
పోటానికి ఒప్పుకోనంటారు ||మావారు||
మావారు రత్నము
దొరకుటా అదృష్టము
మావారు ముత్యము
పొందుటా పూజాఫలము
మావారు వజ్రము
కాంతులు చిమ్ముతారు
మావారు బంగారము
వెలుగులు చల్లుతారు ||మావారు||
మావారి బంధము
ఆనందదాయకము
మావారి రూపము
అందాలభరితము
మావారి హృదయము
మన్ననలకుపాత్రము
మావారి అంతరంగము
మంచితలపులకుతావు ||మావారు||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment