పదాల ప్రకాశం 


చెబితే

చక్కనికవిత్వము చెప్పాలి

తెల్పితే

చిత్తాలు చిందులుత్రొక్కాలి


వ్రాస్తే

కమ్మనికైతలు గుప్పించాలి

అల్లితే

మల్లెపూలమత్తు వ్యాపించాలి


తెరిస్తే

కోకిలకంఠము తెరవాలి

చూపితే

సుందరదృశ్యాలు చూపాలి


తాకితే 

దిమ్మ తిరిగిపోవాలి

త్రోస్తే

తారాలచెంత పడాలి


ఆడితే

ప్రతిభ బహిర్గతముకావాలి

పాడితే

గాంధర్వగానం తలపించాలి


ఎక్కితే

హిమాలయశిఖరాలు ఎక్కాలి

దిగితే

బలిచక్రవర్తిలోకము చేరాలి


వండితే

వంటలు ఘుఘుమలాడాలి

వడ్డిస్తే

వదలక చకచకాతినాలి


తట్టితే

తియ్యనితలపులు తలనుతట్టాలి

ముట్టితే

మదులు మహదానందములోమునగాలి


చల్లితే

తేనెపలుకులు విసరాలి

చిందితే

నవరత్నాలు రాలాలి

  

చూపిస్తే 

పున్నమిచంద్రుని చూపాలి

ఆరబోస్తే

పిండివెన్నెలను ఆరబోయాలి


కూర్పులు 

అద్భుతంగా కలసిపోవాలి 

మాటలు 

సహజంగా ప్రవహించాలి 


కవులు

కుతూహలము పంచాలి  

పాఠకులు 

పరవశము పొందాలి 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog