సాహితీపయనంలో......
ఎన్ని మదులు
దోచానో
ఎన్ని ఙ్ఞాపకాలు
దాచానో
ఏమి మాటలు
చెప్పానో
ఏమి కోతలు
కోసానో
ఏమేమి అందాలు
చూచానో
ఏమేమి ఆనందాలు
పంచానో
ఏఏ ఆటలు
ఆడానో
ఏఏ పాటలు
పాడానో
ఎక్కడెక్కడికి
వెళ్ళానో
ఎవెరెవరిని
కలిసానో
ఏ దారులు
పట్టానో
ఏ గమ్యాలు
చేరానో
ఎట్లా అక్షరాలు
అల్లానో
ఎట్లా పదములు
పేర్చానో
ఎట్లాంటి కవితలు
రాశానో
ఎట్లాంటి పత్రికలు
ప్రచురించాయో
ఎందరు పిలిచి
పురస్కారాలందించారో
ఎందరు ఎన్నుకొని
బహుమతులిచ్చారో
ఎలా సన్మానాలు
చేశారో
ఎలా సత్కారాలు
పొందానో
ఎవరి వేదికలెక్కి
ప్రసంగించానో
ఎవరి సభలకువెళ్ళి
కవితాపఠనంచేశానో
ఎంత ఖ్యాతిని
సంపాదించానో
ఎంత గౌరవాన్ని
అందుకున్నానో
సాహితీ పెద్దలకు
ధన్యవాదాలు
సాహిత్య సంస్థలకు
శుభాకాంక్షలు
కవన ప్రోత్సాహకులకు
వందనాలు
కవితా ప్రియులకు
కృతఙ్ఞతలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment