ఆ కవి....
ఆ కవిమనసులో రేగిన
ఆలోచనలెన్నో
అవి కవితలుగా మలచిన
సందర్భాలెన్నో
ఆ కవి నిద్దురలోకన్న
కలలెన్నో
అవి కవితారూపం చెందిన
సమయాలెన్నో
ఆ కవి కవ్వింపులకుగురైన
పూటలెన్నో
అవి అక్షరరూపం దాల్చిన
దినాలెన్నో
ఆ కవిగళం తెరిపించిన
గేయాలెన్నో
అవి అమృతాన్ని చిందించిన
ఘడియలెన్నో
ఆ కవి ఆలపించిన
కవితలెన్నో
అవి సత్కారాలు అందించిన
వేళలెన్నో
ఆ కవి కలంపట్టిన
కాలమెంతో
అవి పుటల్ని మెరిపించిన
సఫలమైనరోజులు ఎన్నో
ఆ కవి సేకరించిన
విషయాలెన్నో
అవి అద్భుత రాతలైన
నిమిషాలెన్నో
ఆ కవి సృజించిన
సౌందార్యాలెన్నో
అవి పాఠకులకు చేకూర్చిన
సంతోషాలెన్నో
ఆ కవి వెలిగించిన
దీపాలెన్నో
అవి కవనప్రియులకు చూపించే
దారులెన్నో
ఆ కవి మురిపించిన
హృదయాలెన్నో
అవి అతడిని అమరుడినిచేసిన
స్మృతులెన్నో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment