కలలుకంటున్నా!
కమ్మదనాలతో
కట్టేయాలనుకుంటున్నా
తియ్యదనాలతో
పట్టేయాలనుకుంటున్నా
కోకిలకంఠంతో
కుతూహలపరచాలనుకుంటున్నా
హంసనడకలతో
హాయినొసగాలనుకుంటున్నా
వెన్నెలజల్లులతో
తడపాలనుకుంటున్నా
విహారయాత్రలతో
వినోదపరచాలనుకుంటున్నా
కెరటాలతో
కేరింతలుకొట్టించాలనుకుంటున్నా
సరసాలతో
సయ్యాటలాడించాలనుకుంటున్నా
తేనెపలుకులతో
తృప్తిపరచాలనుకుంటున్నా
సుమసౌరభాలతో
సంతసపరచాలనుకుంటున్నా
కలలతో
కవ్వించాలనుకుంటున్నా
కల్పనలతో
భ్రమలుకొల్పాలనుకుంటున్నా
అక్షరకుసుమాలతో
అలరించాలనుకుంటున్నా
పదవిన్యాసాలతో
పరవశపరచాలనుకుంటున్నా
అందమైనమైనమాటలతో
అద్భుతకవితలురాయాలనుకుంటున్నా
అనందమైనభావాలతో
అబ్బురపరచాలనుకుంటున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment