కవితాజల్లులు
చిరుజల్లులు
చిటపటారాలుతాయి
చిందులుత్రొక్కిస్తాయి
చిరునవ్వులొలికిస్తాయి
వెన్నెలజల్లులు
వినోదపరుస్తాయి
విహరించమంటాయి
విరహంలో ముంచుతాయి
పువ్వులజల్లులు
ఆహ్వానంపలుకుతాయి
ముచ్చటపరుస్తాయి
ముసిముసినవ్వులనిస్తాయి
ప్రేమజల్లులు
మనసునుముడతాయి
గుండెనుతాకుతాయి
హృదినికరిగిస్తాయి
ప్రశంసలజల్లులు
మునగచెట్టునెక్కిస్తాయి
ఆకాశానికెగిరిస్తాయి
గర్వాన్నికలిగిస్తాయి
నవ్వులజల్లులు
మోములువెలిగిస్తాయి
ముగ్ధతకలిగిస్తాయి
మోదముచిందిస్తాయి
నేతలవరాలజల్లులు
ఆశలులేపుతాయి
ఓట్లనుకుమ్మరిస్తాయి
అధికారాన్నిచేజిక్కిస్తాయి
అమృతజల్లులు
తడవమంటాయి
త్రాగమంటాయి
తృప్తిపడమంటాయి
అక్షరజల్లులు
అందుకోమంటాయి
అల్లమంటాయి
అలరించమంటాయి
కవనజల్లులు
మదులదోస్తాయి
మురిపిస్తాయి
మన్ననలుపొందుతాయి
జల్లులు
ఆకాశాన మబ్బులుగామారాలి
చక్కనిజాబిలిని పొడిపించాలి
ఇంద్రధనస్సును సంధించాలి
జల్లులు
కవులను కలముపట్టించాలి
పాఠకులను పఠింపజేయాలి
సాహిత్యమును సుసంపన్నంచేయాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment