నేను
ఎవరనుకుంటివిరా
ఏమనుకుంటివిరా
అపర బ్రహ్మనురా
అక్షర ప్రియుడినిరా ||ఎవర||
రాతలు రాసేవాడినిరా
కోతలు కోసేవాడినిరా
మాటలు చెప్పేవాడినిరా
తూటాలు ప్రేల్చేవాడినిరా
పువ్వులు చల్లేవాడినిరా
నవ్వులు చిందేవాడినిరా
ఆటలు ఆడించేవాడినిరా
పాటలు పాడించేవాడినిరా ||ఎవర||
కలమును పట్టేవాడినిరా
గళమును విప్పేవాడినిరా
కవితలు చదివేవాడినిరా
కల్పనలు చేసేవాడినిరా
మదులు ముట్టేవాడినిరా
హృదులు తట్టేవాడినిరా
అందాలు చూపించేవాడినిరా
ఆనందాలు కలిగించేవాడినిరా ||ఎవర||
కాంతులు చిమ్మేవాడినిరా
తేనియలు విసిరేవాడినిరా
లాభాలు కూర్చేవాడినిరా
శుభాలు కోరేవాడినిరా
హితాలు పలికేవాడినిరా
కితాబు ఇచ్చేవాడినిరా
సవ్వడులు చేసేవాడినిరా
చిందులు త్రొక్కించేవాడినిరా ||ఎవర||
ప్రకృతిని ప్రేమించేవాడినిరా
పాఠకుల్ని మెప్పించేవాడినిరా
ఊహాలు రేపేవాడినిరా
భావాలు తెలిపేవాడినిరా
ముచ్చట్లు గుప్పించేవాడినిరా
చప్పట్లు కొట్టించేవాడినిరా
లక్ష్యాలు ఏర్పరిచేవాడినిరా
ముందుకు నడిపించేవాడినిరా ||ఎవర||
సేవలు చేయించేవాడినిరా
సుఖాలు అందించేవాడినిరా
ఎత్తుకు ఎగిరించేవాడినిరా
ఎవరెస్టు ఎక్కించేవాడినిరా
కొండలు దాటించేవాడినిరా
కోనలు తిప్పించేవాడినిరా
పచ్చదనాలు పెంచమనేవాడినిరా
పరిసరాలు కాపాడమనేవాడినిరా ||ఎవర||
కడుపులు నింపేవాడినిరా
దాహాలు తీర్చేవాడినిరా
నదిలో దింపేవాడినిరా
కడలిలో తేల్చేవాడినిరా
రవి చేరనిచోటుకూ
వెళ్ళేవాడినిరా
మది పొంగిపొర్లినవేళా
కవనాలల్లేవాడినిరా ||ఎవర||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment