ఎందుకో?
పగలు
పిలుస్తుంది
తిమిరంతో
సమరంచెయ్యమని
అందాలు
ఆహ్వానిస్తున్నాయి
వికారాలను
విదిలించుకోమని
పూలు
ప్రాధేయపడుతున్నాయి
తుంచకుండా
పరిరక్షించమని
ఊహలు
ఊరుతున్నాయి
మనసును
శుద్ధిచెయ్యమని
మెదడు
బ్రతిమలాడుతుంది
అఙ్ఞానాంధకారాన్ని
పారద్రోలమని
పలుకులు
తేనెనుచిమ్ముతున్నాయి
నిస్సారాన్ని
నిరోధించమని
ప్రకృతి
అర్ధిస్తుంది
విచ్ఛిత్తికి
పాలుపడవద్దని
నీలిమబ్బు
చినుకులుచల్లుతుంది
క్షామకరువులను
కట్టడిచెయ్యాలని
వెలుగులు
చిమ్ముతున్నాయి
నిండినచీకటిని
తొలగించమని
వెన్నెల
వెదజల్లుతుంది
విచారాలను
వదిలించుకోమని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment