నవ్వమ్మ నవ్వమ్మ నవ్వమ్మా!
నవ్వమ్మ నవ్వమ్మ నవ్వమ్మా
అందాలభరిణా నవ్వమ్మా
చిలుకలకొలికీ నవ్వమ్మా
ముద్దులపట్టీ నవ్వమ్మా ||నవ్వమ్మ||
తేనెపలుకులు చిందమ్మా
ముద్దుమాటలు విసరమ్మా
కమ్మనికాంతులు చిమ్మమ్మా
చక్కనిమోమును చూపమ్మా
అమ్మపై ప్రేమను చాటమ్మా
నాన్నకు ముద్దులు ఇవ్వమ్మా
వెన్నా ముద్దలు మింగమ్మా
నేతీ అరిసెలు తినవమ్మా ||నవ్వమ్మ||
చెట్టాపట్టా లేయమ్మా
చెమ్మాచెక్కా ఆడమ్మా
దాగుడుమూతలు నేర్వమ్మా
తొక్కుడుబిళ్ళలు వేయమ్మా
అచ్చనగాయలు తేవమ్మా
విసిరేసిగాలిలో పట్టమ్మా
కబాడికూతలు కూయమ్మా
బొమ్మలపెళ్ళిల్లు చేయమ్మా ||నవ్వమ్మ||
బడికీ రోజూ వెళ్ళమ్మా
పంతుళ్ళు చెప్పినట్లు వినమ్మా
గురువులనూ గౌరవించమ్మా
మిత్రులతో చక్కగామెలగమ్మా
అ ఆలను చక్కగాదిద్దమ్మా
అమ్మా ఆవుల నేర్వమ్మా
పెన్సిలుతో గీతలు గియ్యమ్మా
రంగులతో చిత్రాలు వెయ్యమ్మా ||నవ్వమ్మ||
అక్కలతో హాయిగా గడుపమ్మా
అన్నలతో ముచ్చట్లు చెప్పమ్మా
చెల్లెళ్ళకు కథలు చెప్పమ్మా
తమ్ముళ్ళకు హితాలు బోధించమ్మా
నిత్యము స్నానము చేయమ్మా
చక్కని బట్టలు తొడుక్కోవమ్మా
వయ్యారాలూ ఒలికించమ్మా
సింగారాలు చూపించమ్మా ||నవ్వమ్మ||
గుండ్లపల్లి రాజేంద్రప్రసద్, భాగ్యనగరం
Comments
Post a Comment