కవనకౌగిలి
కవనకౌగిలిలో
బంధీనయ్యా
విడిపించుకోలేకపోతున్నా
పద్మవ్యూహంలో
చిక్కుకపోయా
ప్రతిఘటించలేకపోతున్నా
బురదలో
కూరుకొనిపోయా
పొడినేలచేరి బ్రతకాలనుకుంటున్నా
సుడిగుండంలో
గుండ్రంగా తిరుగుతున్నా
బయటపడలేకపోతున్నా
అక్షరజ్వాలలో
తగలబడుతున్నా
తప్పించుకోలేకపోతున్నా
పదప్రవాహంలో
కొట్టుకుపోతున్నా
వేగానికి తట్టుకోలేకపోతున్నా
చలిలో
ఒణికిపోతున్నా
కవిత్వవెచ్చదనానికి కాచుకొనియున్నా
కడలికెరటాల్లో
నిశ్చేష్టుడనయ్యా
తీరం చేరలేకపోతున్నా
కవితలలో
మునిగిపోతున్నా
ఊపిరాడక విలవిలలాడుతున్నా
సాహితీవనంలో
సమయంగడుపుతున్నా
భావాలమాయకు లొంగిపోతున్నా
చిక్కుల్లో
పడవేసినా
కవిత్వమే అందం
మదుల్లో
నిలిచిపోయినా
కవనమే ఆనందం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment