కవనసృష్టి 


కాగితాలపై

కొన్ని అక్షరాలుచల్లు

అవి అవుతాయి

కవితలు కధలు కావ్యాలు 


లోకంపై

కొన్ని వెలుగులువెదజల్లు

అవి అవుతాయి

దీపాలు పగలు ఙ్ఞానము 


మనసులపై

కొన్ని రంగులుపొయ్యి

అవి అవుతాయి

అరణ్యం ఆకాశం మైదానం


ప్రకృతిపై

కొన్ని చూపులుసారించు

అవి అవుతాయి

అందాలు ఆనందాలు ఆకర్షణలు 


ఆకాశంపై

దృష్టి కేంద్రీకరించు

అవి ఆవిష్కరిస్తాయి

మేఘాలు చినుకులు తారలు 


నీటిపై

కొన్ని కాగితాలువదులు

అవి అవుతాయి

పడవలు చాపలు పయనాలు


నేలపై

కొన్ని విత్తనాలువెదబెట్టు

అవి అవుతాయి

పంటలు కూరగాయలు భోజనాలు


మనుజులపై

కొన్ని పుష్పాలజల్లుకురిపించు

అవి పలుకుతాయి

ఆహ్వానాలు గొప్పదనాలు విశిష్టతలు


చెట్లపై

కొన్ని పదాలవానకురిపించు

అవి పుడమికిస్తాయి

పచ్చదనం ప్రాణవాయువు వర్షాలు


కవులపై

ప్రశంసలు కురిపించు

అవి సృష్టిస్తాయి

విశిష్టభావాలు విభిన్నవిషయాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog