ప్రియా! ఓ ప్రియా!!
మాటలు వదిలితే మురవాలా
కాంతులు విసిరితే వెలగాలా
నవ్వులు చిమ్మితే వీక్షించాలా
పువ్వులు చల్లితే పులకించాలా ||మాటలు||
తేనెపలుకులు ఒలికితే చవిచూడాలా
సుమపరిమళాలు చిలికితే ఆస్వాదించాలా
పెదవులు తెరిస్తే పవశించిపోవాలా
కోకిలగళము ఎత్తితే వినాలా ||మాటలు||
రమ్మని పిలిస్తే రావాలా
చేతిని చాస్తే కలపాలా
ఆడుదామని అంటే ఆడాలా
పాడుదామాని అంటే పాడాలా ||మాటలు||
అందాలు చూపితే కనాలా
ఆనందము ఒసగితే పొందాలా
ప్రేమగ పిలిస్తే పలకాలా
తోడును కోరితే నిలవాలా ||మాటలు||
సోకులు చూపితే కులకాలా
జోకులు వేస్తే నవ్వాలా
చిటుకులు చెప్పితే వినాలా
కిటుకులు నేర్పితే చెయ్యాలా ||మాటలు||
చూపులు విసిరితే కలపాలా
విరహము కలిగితే విలపించాలా
వెన్నెలలోనా విహరించాలా
చుక్కలక్రింద తిరగాలా ||మాటలు||
జీవిత గమ్యము తేల్చాలా
నూతన దారిలో నడవాలా
సూటిగ పయనము సాగించాలా
సకల కోర్కెలను సాధించాలా ||మాటలు||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment